మనీషా, నాయర్లకు కోర్టునోటీస్!
ముంబై: ఏక్ ఛోటీసీలవ్ స్టోరీ కేసుకు సంబంధించి ముంబైహైకోర్టు శుక్రవారం హీరోయిన్ మనీషాకొయిరాలా, ఆ చిత్ర దర్శకుడు శశిలాల్‌నాయర్లకు షోకాజ్ నోటీస్ లు జారీచేసింది. కేసు కోర్టులో నడుస్తున్నప్పుడు రాజ్యంగేతర శక్తులను కలవడం తప్పు అని కోర్ట్‌పేర్కొంది. ఇది కోర్టు ధిక్కారణం చర్యేనని న్యాయమూర్తులుజస్టిస్ ఆర్.ఎమ్. లోధా, దిలిప్ భోస్లేలు పేర్కొన్నారు.వీరిపై కోర్ట్ ధిక్కారణ చర్య ఎందుకుచేపట్టరాదో తెలపవల్సిందిగా న్యాయమూర్తులుఆదేశించారు. అక్టోబర్ ఐదవ తేదీలోపు సమాధానంఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు.
కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు మూడోవ్యక్తిని సంప్రదించడం అభ్యంతరకరం.ఇది కోర్టు గౌరవాన్ని తగ్గించడమే అవుతుంది. అనిన్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. శివసేన అధినేత బాల్‌థాకరేకు నాయర్ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటుచేయడం, మనీషా థాకరేతో సంప్రదింపులు జరిపినట్లుమీడియాలో వచ్చిన వార్తలను కోర్టు పరిగణనలోకి తీసుకొని ఈనోటీసులు జారీచేసింది.












Click it and Unblock the Notifications