రాజధాని ప్రమాదం వెనక కుట్ర లేదు
పాట్నా: రాజధానిఎక్స్‌ప్రెస్ ప్రమాదం వెనుక కుట్ర ఉన్నదనే ఆరోపణలను ఔరంగాబాద్ పోలీసు సూపరింటిండెంట్, జిల్లా మెజిస్ట్రేట్ త్రోసిపుచ్చారు. ఈవిషయాన్ని రైల్వే వర్గాలు వెల్లడించాయి. 119 మందిని బలిగొన్న ఈ ప్రమాదం వెనుక కుట్ర ఉన్నదనిరైల్వే మంత్రి నితీష్‌కుమార్, సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించినవిషయం తెలిసిందే.
రైల్వే మంత్రులు చేసిన ప్రకటనతో రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌యాదవ్ విభేదించారు.రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల, ట్రాక్‌ను, వంతెనను సరిగా నిర్వహించకపోవడం వల్ల ప్రమాదం సంభవించిందని ఆయన అన్నారు.
ఫిష్‌ప్లేట్లు తొలగించారనే రైల్వే అధికారుల వాదనను ఔరంగాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ ఎస్. సిధార్థ్, పోలీసు సూపరింటిండెంట్ ఎస్.కె. ఝా త్రోసిపుచ్చారు. రాజధానిఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై వీరు రెండు పేజీల నివేదికను సమర్పించారు.












Click it and Unblock the Notifications