కరవునివారణకు సలహాలివ్వండిః బాబు
హైదరాబాద్‌ః రాష్ట్రంలో కరవు పరిస్థితి ఇంకా తీవ్రంగా వుండడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. కరవు నివారణకు ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా వున్నదని ఆయన వెల్లడించారు. తీవ్రరూపంలో వున్న కరవు నివారణకు సలహాలివ్వాల్సిందిగా ఆయన నిపుణులనుకోరారు. గ్రామీణాభివృద్ధిపై ప్రారంభమైన మూడు రోజుల సదస్సులో ఆయన ప్రసంగించారు. నీరు-మీరు, వాటర్ షెడ్ పధకాల వల్ల భూగర్భజలాల మట్టాలు గణనీయంగాపెరిగాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.












Click it and Unblock the Notifications