హైదరాబాద్: కరువుతో సతమతమవుతోన్న రైతులను అన్ని విధాల ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. గురువారం ఉన్నతాధికారులతో ఆయన హైదరాబాద్ లో కరువుపై సమీక్షాసమావేశం జరిపారు.
అనంతపురం తదితర ప్రాంతాల్లో కరువువిలయతాండవం చేస్తోందని, రైతులు ప్రత్యమ్నాయ పంటలు వేసుకునేందుకు కావాల్సిన సాయం చేస్తామన్నారు. అంతేకాకుండా, కరువు ప్రాంతాల్లోని రైతులను ఆదుకునేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.