నిమజ్జనానికిభారీ బందోబస్త్!
హైదరాబాద్: 11 రోజుల పాటు భక్తులతో వేడుకలు స్వీకరించిన బొజ్జగణపయ్య శుక్రవారం నిమజ్జనానికి సిద్దమవుతున్నాడు. ఈ సారి హైదరాబాద్ లో సామూహిక నిమజ్జనం రోజు శుక్రవారం కావడంతో నగర పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనం రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్దమొత్తంలో పోలీసుల బలగాలను వినియోగించుకుంటున్నారు. 21 వేల మంది పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఏడాది నగరంలో 11వేల వినాయకుడి మండపాలను ఏర్పాటు చేశారు.
వినాయకుడి ఊరేగింపు ప్రశాంతంగా సాగేందుకు ఈ సారి ముస్లిం పార్టీలన్ని స్వచ్చందంగా ముందుకు రావడం విశేషం. అలాగే హైదారాబాద్ లోని ఖైరాతాబాద్ లోని అతిపెద్ద వినాయకుడి ఊరేగింపు కోసం ట్రాలీని ఈసారి రాష్ట్రప్రభుత్వమే సమకూరుస్తుండడం విశేషం.












Click it and Unblock the Notifications