రైతు ఆత్మహత్య- ఆగిన కావేరి
బెంగుళూరుః మైసూరులోని కబిని రిజర్వాయర్ లో దూకి ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడంతో కావేరి జలాలవివాదం ఉగ్రరూపం ధరించింది. దీంతో తమిళనాడుకు కావేరీ జలాల విడుదలను బుధవారం రాత్రి నుంచి నిలిపివేసినట్లు కర్నాటక ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ ప్రకటించారు. బీచనహల్ళి గ్రామపంచాయతీ సభ్యుడుగురుస్వామి, మరో నలుగురు బుధవారం నాడు రిజర్వాయర్ లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు.
కర్నాటక ముఖ్యమంత్రి కృష్ణ అత్యవసరంగా క్యాబినెట్ సమావేశాన్ని ఎర్పాటు చేశారు. కావేరీ జలాల విడుదలపై తక్షణం సమావేశం ఏర్పటు చేయాల్సిందిగా కృష్ణ ప్రధాని వాజ్‌పేయిని అభ్యర్థించే అవకాశం వుంది. కోపోద్రిక్తులైన మైసూరు రైతులు జయలలిత దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.












Click it and Unblock the Notifications