నక్సల్స్ మందుపాతరకు ముగ్గురుబలి
అనంతపురంః అనంతపురం జిల్లాలో నక్సలైట్లు మందుపాతరపేల్చి ముగ్గురిని బలిగొన్నారు. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం దూపంపల్లి అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం నక్సలైట్లు మందుపాతరపేల్చారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు ఎక్సైజ్ పోలీసులు, జీపు డ్రైవర్ దుర్మరణం పాలయ్యారు. మందుపాతరపేల్చిన వెంటనే జీపులో వున్న మిగిలిన పోలీసులపై నక్సలైట్లు కాల్పులు ప్రారంభించారు. దీంతో జీపులో ప్రయాణిస్తున్నమిగిలిన పోలీసులు పప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు.












Click it and Unblock the Notifications