వార్‌ హింసను వీడాలి: దేవేందర్‌

హైదరాబాద్‌: హింసాత్మక చర్యలను వీడి చర్చల ద్వారాశాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని హోంమంత్రి దేవందర్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. కర్నూలు, అనంతపురంలో వార్‌ చేపట్టిన విధ్వంసక చర్యల నేపథ్యంలో ఆయన స్పందించారు. అమాయకులను పొట్టనబెట్టుకోవడం ద్వారా ప్రజల దృష్టిలో వార్‌ మరింత చులకనఅయిందని దేవేందర్‌ గౌడ్‌ గురువారం హైదరాబాద్‌ లో అన్నారు.

తొలిసారిగా దేవేందర్‌ గౌడ్‌ వార్‌ తో చర్చలువిఫలమయ్యాని అంగీకరించాడు. ఇప్పటివరకు ప్రభుత్వం వార్‌ తో జరిపిన చర్చలు ఆగిపోయాయని మాత్రమే ప్రకటిస్తూ వచ్చింది. అవివిఫలమయ్యాయని అధికారికంగా ప్రకటించలేదు. అయితే, చర్చల ద్వారానేశాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని ఆయన మరోసారి స్పస్టంచేశారు. చర్చలకు ఇప్పటకీ సిద్దమని దేవేందర్‌ గౌడ్‌ మళ్ళీ ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటకీ చర్చలకు సిద్దంగా ఉంది. హింసను రూపుమాపాలనేదే మా ప్రభుత్వ ధ్యేయం. అందుకే రాష్ట్రంలో నక్సలిజానికి శాశ్వత పరిష్కారానికై మేం కృషిచేస్తున్నాం. అని ఆయన అన్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+