వై.ఎస్. ధర్నా - బాబు ఫోన్ తోవిరమణ
అనంతపురంః కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు రైతు సమస్యలపై గురువారం ఉదయం అనంతపురంలో ధర్నా ప్రారంభించారు. అనావృష్టితో బాధపడుతున్న రైతుల సమస్యలను అంతకు ముందు ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకొనేందుకు కనీసం విత్తనాలు లేని దుస్థితి వున్నదని రైతులు వై.ఎస్. కు మొరపెట్టుకున్నారు. దీంతో వై.ఎస్. గురువారం మధ్యాహ్నం అనంతపురంలోని వ్యవసాయం కార్యాలయం వద్ద ధర్నా ప్రారంభించారు.
ప్రత్యామ్నాయ పంటలకు రైతులకు విత్తనాలు సరఫరా చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిందని చంద్రబాబు నాయుడు ధర్నా చేస్తున్న వై.ఎస్. కు ఫోన్ చేసి చెప్పారు. ఈవిషయాన్ని వై.ఎస్. ధర్నా వద్ద గుమికూడిన వారికి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. రైతులకు విత్తనాలు ఇచ్చేందుక ప్రభుత్వం అంగీకరించడంతో వై.ఎస్. ధర్నావిరమించుకున్నారు.












Click it and Unblock the Notifications