సలేం పాస్‌పోర్టు: ఏజెంటే కీలకం
హైదరాబాద్: అండర్‌వరల్డ్ డాన్ అబూ సలేంకు, ఆయన భార్య, సినీనిటి మోనికాబేడికి, మరొకరికి నకిలీ పాస్‌పోర్టులు జారీ కావడంలో ఏజెంట్ హమీద్‌దే కీలక పాత్ర అని అనుమానిస్తున్నారు. హమీద్ మరో 12 నకిలీ పాస్‌పోర్టులు ఇప్పించినట్లు పోలీసు వర్గాలంటున్నాయి.
తమకు వచ్చిన పేర్లకు సంబంధించిన వ్యక్తులపై కేసులేమీ లేవని, ఆ మూడుపేర్లపై పాస్‌పోర్టులు జారీ చేయడంలో వేరే ఉద్దేశ్యాలేమీ లేవని సత్తార్ అంటున్నాడు.మిగతా ఇద్దరు కూడా ఇదే వాదన వినిపిస్తున్నారు. చాలా విధులు తాము నిర్వహించాల్సి ఉంటుందని, పని ఒత్తిడి విపరీతంగా ఉంటుందని యాసిన్ చెబుతున్నాడు. హెడ్ కానిస్టేబుల్ తన వద్దకు తెస్తే సరిగా ఉన్నాయా, లేదా అని చూసి పాస్‌పోర్టులు జారీ చేస్తుంటున్నానని, అబూసలేంకు, మరో ఇద్దరికి నకిలీ పాస్‌పోర్టులు జారీ చేయడం ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందని కాదని శ్రీనివాస్ చెబుతున్నాడు.
హామీద్ పట్టుబడితే తప్ప అబూసలేంకు, మోనికా బేడికి, మరో వ్యక్తికి నకిలీ పాస్‌పోర్టులు జారీకావడంలో ఎవరి పాత్ర ఏ మేరకు ఉన్నదనేది వెల్లడి కాదని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
