వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగారెడ్డిలో పోలీస్‌ కమీషనరేట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో నేరాల సంఖ్య రోజురోజుకీపెరిగిపోతుంది. దీంతో పదిహేను రోజుల్లో రంగారెడ్డి జిల్లాలో పోలీస్‌ కమీషనరేట్‌ ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను ప్రారంభిస్తున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి దేవేందర్‌ గౌడ్‌ సోమవారం తెలిపారు.

హైదరాబాద్‌ జోన్‌ ఫరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాల ఎస్పీ, డిఎస్పీలతో ఆయన హైదరాబాద్‌ లో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. పటిష్టమైన నెట్‌ వర్క్‌ ను ఏర్పాటు చేసేందుకు ఈ కమీషనరేట్‌ ను ప్రారంభిస్తున్నామన్నారు.

15 రోజుల్లో ఇది పనిచేయడం ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు. ఇక ప్రతిరాత్రి హైదరాబాద్‌ లో పోలీస్‌పెట్రోలింగ్‌ ను ఉధృతం చేస్తామన్నారు. రైల్వే పోలీస్‌లతో కూడా పోలీస్‌ వాచ్‌ చేయిస్తామని తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X