బూసాన్: ఆసియా క్రీడల పురుషుల హాకీ టోర్నమెంట్‌లో భారత్ ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించిఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన సెమీఫైనల్‌లో భారత్ పాకిస్థాన్‌ను 4-3 స్కోరుతో ఓడించింది.
ఆట మొదటి అర్థభాగం వరకు ఇరు జట్లు 2-2 స్కోరుతో సమానంగా ఉన్నాయి. భారత్‌ఫైనల్‌లో దక్షిణ కొరియాతో తలపడుతుంది. మరోసెమీ ఫైనల్‌లో దక్షిణ కొరియా మలేషియాను 2-0 స్కోరుతో ఓడించింది. భారత్ ఆటగాళ్లు ధన్‌రాజ్ పిళ్లే, దల్జీత్‌సింగ్, గగన్ అజిత్ గోల్స్ చేశారు. పాకిస్థాన్ తరఫున సోహైల్ అబ్బాస్, షబ్బీర్ ముహ్మద్ గోల్స్ చేశారు.