సిఎం పదవిని ఆశిస్తున్న పిడిపి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణం ఏర్పాటుకు ఏర్పాటుకుఅంగీకరించిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పిడిపి) కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తోంది. తమ నాయకుడు ముఫ్తీ మహ్మద్ సయీద్‌కు ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు అవకాశం కల్పించాలని అడుగుతోంది.
సంప్రదింపుల ద్వారా ముఖ్యమంత్రి పదవి విషయంలో ఒక నిర్ణయానికి వస్తామని ఆయన అన్నారు. జమ్మూ ప్రొవిన్స్‌లో కాంగ్రెస్‌కు మెజారిటీ లభిస్తుందని,అందువల్ల ఆ ప్రాంతానికి చెందిన నేత ముఖ్యమంత్రి కావాలనే డిమాండ్ ఉంటుందని ఆయన అన్నారు. అయితే కాశ్మీర్ లోయ ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోసుకోవాలనేవిషయం మర్చిపోకూడదని, ఇక్కడ నేత ముఖ్యమంత్రి అయితేమిలిటెంట్లతో చర్చలకు సంబంధాలు ఏర్పడతాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications