హైదరాబాద్: హైదరాబాద్ లో జరుగుతోన్న ప్రపంచ చెస్ కప్ -2002లో శుక్రవారం శశికిరణ్ సంచలనం సృష్టించాడు. డిఫెండింగ్ ఛాంపియన్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ను కృష్ణన్ శశికిరణ్ ఓడించాడు.
శశికిరణ్ ఆటతీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. 53 ఎత్తుల్లో అతను విశ్వనాథన్ ఆనంద్ ను ఓడించాడు. తెల్లపావులతో ఆడిన శశికిరణ్ ప్లాన్ ప్రకారం ఆడుతూ ఆనంద్ ను బోల్తా కొట్టించాడు. మరో ఆటలో హరికృష్ణ మరో సారి ఓడిపోయాడు. శుక్రవారం జరిగిన రెండో రౌండ్లోనూ హరికృష్ణ ఓటమి పాలయ్యాడు.