వెనక్కి తగ్గని బాల్‌ థాకరే

ముంబాయి: తన దసరాపర్వదిన ప్రసంగాన్ని శివసేన అధినేత బాల్‌ థాకరే సమర్థించుకున్నారు. తన దసరా ప్రసంగంలో ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై మహారాష్ట్ర ప్రభుత్వం బాల్‌ థాకరేపై క్రిమినల్‌ కేసు నమోదు చేసింది. తాను ముందస్తు బెయిల్‌ తీసుకోబోనని థాకరే ప్రకటించారు. తనపై కేసు నమోదు చేసినందుకు ఆయన ముఖ్యమంత్రివిలాసరావు దేశ్‌ముఖ్‌పై, ఉప ముఖ్యమంత్రి ఛగన్‌ భుజబల్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు.

తాను అభ్యంతరకరమైన వ్యాఖ్యలేవీ చేయలేదని, ఉగ్రవాదంపై పోరు ఆత్మాహుతిదళాలు ఏర్పాటు కావాలనే మాత్రమే తాను పిలుపునిచ్చానని, భారత ముస్లింలకు వ్యతిరేకంగా తాను ఏ విధమైన వ్యాఖ్యలూ చేయలేదని ఆయనవివరణ ఇచ్చారు.

అభ్యంతరకరమైనవి అయితే ఆ వ్యాఖ్యలు తాను చేసి ఉండేవాడిని కానని, తన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని, తనపై చర్యకు భుజబల్‌ బాధ్యుడు కారని, దేశ్‌ముఖ్‌ బాధ్యుడని ఆయన అన్నారు.
ఇంతకు ముందు కూడా తాను ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేయలేదని, ఇప్పుడు కూడా చేయబోనని, తన ప్రకటనకు విస్తృత ప్రచారం కల్పించిన మీడియాకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+