పోలీసుకాల్పుల్లో జిన్నా హతం
కడప: పోలీసులు తమపద్దతినే పాటించారు. ఎట్టకేలకు ఆలీవ్ గ్రీన్ దోపిడీముఠా నాయకుడి జిన్నాను పోలీసులుకాల్చివేశారు. పోలీసుల కథనం ప్రకారం..కరడుగట్టిని నేరస్థుడు కోదాడి వెంకటకృష్ణఅలియాస్ జిన్నా శుక్రవారం రాత్రి ఒక కానిస్టేబుల్ పై కాల్పులు జరిపిపారిపోయేందుకు ప్రయత్నించడంతో అతన్ని హతమార్చారు.
హైదరాబాద్ నుంచి పారిపోయి కడపలోప్రత్యక్షమైన జిన్నా శుక్రవారం పోలీలసుల చిక్కాడు. రంగారెడ్డి జిల్లా ట్రెయినీడీఎస్పీ సుజాత నాయకత్వంలోని పోలీసు బృందం శుక్రవారం రాత్రి అతన్ని పట్టుకొని నల్గొండతీసుకువచ్చేందుకు ప్రయత్నించింది.
శనివారం తెల్లారుజామున మూడు గంటలకు ఈ ఘటనజరిగింది. జిన్నా తండ్రి కూడా కరుడుగట్టిన నేరస్తుడే. అతను ఇప్పుడుజైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. జిన్నా సోదరుడు కోదాడశ్రీను కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆలీవ్ గ్రీన్‌ముఠాలోని మిగతా తొమ్మిదిమంది ప్రస్తుతం పోలీసుల చేతిలోఉన్నారు. మరో సభ్యుడు నగేష్ దొరకాల్సి ఉంది.












Click it and Unblock the Notifications
