వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉచితవిద్యుత్‌ పై పార్టీలో ఐక్యత

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఉచిత విద్యుత్‌ పై కాంగ్రెస్‌ లో ఎక్కడా విభేదాలు లేవని ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల మంత్రి వాయలర్‌ రవి స్పష్టం చేశారు. పార్టీ అంతా ఈ అంశంపై స్పష్టమైన వైఖరితో ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో మూడు రోజుల పర్యటన నిమిత్తం రవి గురువారం ఉదయం హైదరాబాద్‌ వచ్చారు.

పార్టీ ముఖ్య నేతలంతా విమానాశ్రాయానికి విచ్చేసి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సారి వాయలర్‌ రవికి అసంతృప్త నేతలెవరూ స్వాగతం చెప్పకపోవడం విశేషం.

అనంతరం ఆయన విలేకరులతో ఉచిత విద్యుత్‌ పై మాట్లాడారు. పంజాబ్‌ రాష్ట్ర పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితులు వేరు. ఆయా రాష్ట్రాలు స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే, రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌ విషయాన్ని మ్యానిఫెస్టో కమిటీయే నిర్ణయిస్తుందని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X