ముంబాయి: ఎట్టకేలకు బాలీవుడ్ సినీ నటుడు సల్మాన్ ఖాన్‌కు బెయిల్ లభించింది. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్‌కు సెషన్స్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో సల్మాన్ ఖాన్ విడుదలయ్యారు.
పాస్‌పోర్టును పోలీసులకు అప్పగించాలని, సాక్షులను గానీ, ప్రమాదంలోని క్షతగాత్రులను గానీ కలవడానికి ప్రయత్నించకూడదని సెషన్స్ జడ్జి పి.వి. బావ్‌కర్ సల్మాన్‌ను ఆదేశించారు. విదేశాలకు వెళ్లాలనుకుంటే పూర్తి షెడ్యూల్‌ను తెలియజేసి పోలీసుల నుంచి సల్మాన్ పాస్‌పోర్టును పొందాలని న్యాయమూర్తి తెలియజేశారు. సల్మాన్ బెయిల్‌పై విడుదల కావడం ఆయన కుటుంబసభ్యులను ఆనందంలో ముంచెత్తింది. తండ్రి సలీంఖాన్, సోదరుడు అర్బాజ్ ఖాన్, సవతి తల్లి హెలెన్ పరస్పర ఆలింగనంతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.