దేవదాసు - భారత్ ఆస్కార్‌ఎంట్రీ
ముంబై: 75వ అకాడెమీ అవార్డుల ఎంపికకు భారత్ అధికార చిత్రంగా హిందీ చిత్రం దేవదాసు ఎంపికైంది. శక్తిశమంతా అధ్వర్యంలోని 16 మంది సభ్యుల కల ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ ఆదివారం సమావేశమై దేవదాసును ఆస్కార్ అవార్డులకు పంపించాలని నిర్ణయించింది.
గత ఏడాది లగాన్ ను ఎంపిక చేయగా, అది విదేశీ చిత్రాల్లో ఉత్తమ చిత్రంగా ఆస్కార్ కు నామినేట్ అయింది. అవార్డు రాకపోయినా, బాలీవుడ్ కు విదేశాల్లో మంచి గుర్తింపు తీసుకువచ్చిందా చిత్రం. దీంతో ఈసారి కూడా బాలీవుడ్ చిత్రమే పంపాలని భారత్ భావిస్తోంది. ఈ ఏడాది కేన్స్ లో ప్రదర్శితమైన దేవదాసు చిత్రం అన్ని విధాల తగినదని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
