గుంటూరు: ఒక దొంగబాబాను గుంటూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. దత్తబాబాగా చెలమాణి అవుతున్న శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్‌లో ఒక హత్య కేసులో ఇతను నిందితుడని పోలీసులు చెప్పారు. లక్ష రూపాయల నగదుతో పాటు ఆభరణాలను శ్రీనివాస్ దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఎనిమిది నెలల క్రితం ఇతను గుంటూరుకు మకాం మార్చి దత్తబాబాగా అవతారమెత్తినట్లు వారు చెప్పారు. అయితే తనకే పాపమూ తెలియదని, చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతనతో బతుకుతున్నానని దత్తాబాబాగా అవతారమెత్తిన శ్రీనివాస్ అంటున్నాడు.