వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంక్‌ రేట్ల తగ్గింపు, సిఆర్‌ఆర్‌లో కోత

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: రిజర్వ్‌ బ్యాంక్‌ 25 బేసిస్‌ పాయింట్‌ మేరకు బ్యాంక్‌ రేటును 6.25 శాతానికి, నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్‌ఆర్‌)ని 4.75 శాతానికి తగ్గించింది.

స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) పెరుగుదల రేటును 6- 6.5 నుంచి 5- 5.5కు తగ్గించింది. 2002- 03 సంవత్సరానికి మధ్య కాలిక ద్రవ్య క్రెడిట్‌ పాలసీని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ బిమల్‌ జలన్‌ మంగళవారం ప్రకటించారు. రేపో రేటులో కోత విధించినట్లు, దాన్ని 5.5 శాతానికి తగ్గించినట్లు ఆయన చెప్పారు. సిఆర్‌ఆర్‌ కోత నవంబర్‌ 16వ తేదీ నుంచి, రేపో రేటు కోత అక్టోబర్‌ 29 నుంచి అమలులోకి వస్తాయని ఆయన చెప్పారు.

పరిస్థితులు మారితే తప్ప బ్యాంక్‌ రేటులో మార్పు ఉండబోదని, ఇదే స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరాంతం వరకు కొనసాగుతుందని ఆయన చెప్పారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లోని వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జిడిపి రేటును తగ్గించినట్లు ఆయన తెలిపారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు బాగానే ఉన్నాయని, పెరుగుదల రేటుకు అనుగుణంగా ఉన్నాయని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X