ముగిసిన భారత్ తొలి ఇన్నింగ్స్
కోల్‌కత్తా: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 358 పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసిన భారత్ రెండో రోజు గురువారం మరో 83 పరుగులు మాత్రమే జోడించింది.
మొదటి రెండు టెస్టు మ్యాచ్‌ల్లోనూ ఘోరంగా విఫలమైన వెస్టిండీస్ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగలిగింది. డిల్లాన్ మూడు వికెట్లు తీసుకోగా, కఫీ, లాసన్, పావెల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. హూపర్‌కు ఒక వికెట్ లభించింది.












Click it and Unblock the Notifications