రహస్య అణు కార్యక్రమాలకు బ్రేక్: పిఎం
ముంబాయి: అణ్వాయుధాలను రహస్యంగా తయారు చేయడాన్ని, అణు సాంకేతిక విజ్ఞానాన్ని దొంగచాటుగా చేరవేయడాన్ని అడ్డుకోవాలని ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పిలుపునిచ్చారు.
ప్రతి భారత అణుఇంధన సహకార ప్రాజెక్టు అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగానే ఉన్నదని ఆయన చెప్పారు. భారత్ 1998లో అణు పరీక్షలు నిర్వహించడానికి గల కారణాలేమిటో అందరికీ తెలుసునని ఆయన అన్నారు. దేశ అణు శాస్త్రవేత్తలను ఆయన ప్రశంసించారు. భారత అణ్వాయుధాలన్నీ సొంత పరిజ్ఞానంతో తయారైనవేనని, వీటి తయారీలో అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించలేదని ఆయన చెప్పారు. నూతన అన్వేషణలకు, పరిశోధనలకు ప్రాధాన్యం ఇచ్చి భారత అణు ఇంధన కార్యక్రమాలను అభివృద్ధికర దిశగా నడిపించాలని ఆయన శాస్త్రవేత్తలను కోరారు.












Click it and Unblock the Notifications