కరువు జాబితాలో కరెంట్
హైదరాబాద్: తాజాగా కరువు జాబితాలో కరెంట్ కూడా చేరింది. ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు అధికంగా కరెంట్‌ను వాడుకున్నారని, దీని వల్ల ప్రభుత్వంపై 500 కోట్ల అదనపు భారం పడిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.
కరువు వల్ల రైతులకు సరఫరా చేస్తున్న కరెంట్‌పై ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ మరింత పెరిగే అవకాశం ఉన్నదని ఆయన అన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల విద్యుదుత్పత్పి పడిపోతోందని, వినియోగం పెరుగుతోందని ఆయన చెప్పారు. రైతుల రుణాలపై వడ్డీని మాఫీ చేయాలని, రుణాలను రీషెడ్యూల్ చేయాలని ఆయన అద్వానీని కోరారు.












Click it and Unblock the Notifications