యుపి రెబెల్స్‌కు వెంకయ్య హెచ్చరిక
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని పార్టీ తిరుగుబాటు శాసనసభ్యులను భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు తీవ్రంగా హెచ్చరించారు. వ్యక్తిగత పట్టింపుల కన్నా పార్టీ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, శాసనసభ్యుల ప్రవర్తన పార్టీ ప్రతిష్టను దెబ్బ తీయరాదని ఆయన అన్నారు.
పార్టీ వ్యక్తుల కన్నా గొప్పదని, అందువల్ల పార్టీ పంథాకు అనుగుణంగా మనం మారాలని ఆయన కౌన్సిల్ సభ్యులతో అన్నారు. ఇప్పటికైనా ఉత్తరప్రదేశ్‌లోని తిరుగుబాటు
శాసనసభ్యులు తమ తప్పును గ్రహించి క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి యుపి తిరుగుబాటుదారులు పార్టీ పంథాకు అనుగుణంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications