బిఇడి అడ్మిషన్లు ప్రారంభం
హైదరాబాద్: బి.ఇడి. కాలేజీల్లో సీట్ల భర్తీకి ఎడ్‌సెట్ కౌన్సిలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. హైదరాబాద్‌తో పాటు మరో నాలుగు కేంద్రాల్లో ఆన్‌లైన్ ద్వారా ఎడ్‌సెట్ కౌన్సిలింగ్ జరుగుతుంది.
మొత్తం 9670 బి.ఇడి. సీట్లలో 8309 సీట్లు కౌన్సిలింగ్ ద్వారా భర్తీ అవుతాయి. మిగతా 1361సీట్లను మేనేజ్‌మెంట్ కోటా కింద భర్తీ చేస్తారు. ఈ కౌన్సిలింగ్ 15 రోజులు పాటు సాగుతుంది. కౌన్సిలింగ్‌ను పాఠశాల విద్యామంత్రి మండవ వెంకటేశ్వరరావు సందర్శించారు. సీట్ల కేటాయింపుల్లో మెరిట్‌కు అన్యాయం జరిగితే సహించబోమని ఆయన అన్నారు. సజావుగా దరఖాస్తులు విక్రయించి మెరిట్ ప్రకారం సీట్లు ఇవ్వాలని ఆయన మైనారిటీ విద్యాసంస్థలను హెచ్చరించారు.












Click it and Unblock the Notifications