సైబర్ గ్రామీణ్‌కు వెంకయ్య శ్రీకారం
నెల్లూరు: గ్రామీణ బాండ్‌విడ్త్‌కు సంబంధించిన ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ వెంచఱ్ సైబర్ గ్రామీణ్‌ను భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు శుక్రవారం ప్రారంభించారు. గ్రామీణులకు సమాచార సాంకేతిక (ఐటి) ఫలితాలను అందించే లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు. నెల్లూరుకు 15 కిలోమీటర్ల దూరంలో గల వెంకటాచలం గ్రామంలో ఇది ఏర్పాటయింది.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అనంతకుమార్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి సుమిత్రా మహాజన్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సుభాష్ ముఖారియాల సమక్షంలో టెలికాన్ఫరెన్స్‌లో ఆయన ఈ అత్యధునాతన సౌకర్యాన్ని ప్రారంభించారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఈనాడు గ్రూప్ పబ్లికేషన్స్ అధినేత రామోజీరావు సంభాషణ జరిపారు. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ టెలికాన్ఫరెన్స్ ద్వారా రికార్డు చేసిన సందేశాన్ని పంపారు. ఐటి రంగంలో ఇక్కడ ప్రారంభమైన ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications