మొహం చాటేసిన గంగూలీ
ముంబాయి: భారత కెప్టెన్ సౌరబ్ గంగూలీ విలేకరులకు మొహం చాటేశారు. న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన భారత క్రికెట్ జట్టు శుక్రవారం ఉదయం ఇక్కడికి చేరుకుంది.
ముంబాయి విమానాశ్రయంలో దిగిన గంగూలీ వెనక దారి గుండా వెళ్లిపోయారు. దీంతో విలేకరులు సెల్‌లో ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించారు. మీడియాతో చాలా మాట్లాడాను. సిరీస్ ముగిసింది. నేను చెప్పగలిగేదేమీ లేదు అని అన్నారు. ఆ వెంటనే ఆయన కోల్‌కత్తాకు విమానంలో బయలుదేరి వెళ్లిపోయారు.
న్యూజిలాండ్‌లో భారత్ టెస్టు సిరీస్‌ను 0-2 స్కోరుతో, వన్డే సిరీస్‌ను 2-5 స్కోరుతో ఓడిపోయిన విషయం తెలిసిందే. స్టార్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ పక్కదారి గుండా వెళ్లిపోయాడు. వైస్ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్, జట్టు సహచరులు జవగళ్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే బెంగుళూర్‌లో దిగిపోయారు.
ప్రణాళిక ప్రకారం అంతా సజావుగా జరగలేదని, అయితే ఆటగాళ్లు ఆలోచనాధోరణి పాజిటివ్‌గానే ఉన్నదని, దక్షిణాఫ్రికాలో జరిగే ప్రపంచ కప్‌పై దృష్టి కేంద్రీకరించామని ఆల్ రౌండర్ సంజయ్ బంగర్ చెప్పారు. అజిత్ అగార్కర్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్‌లు ముంబాయిలో దిగారు.












Click it and Unblock the Notifications