మైనార్టీ సీట్లు అమ్ముకుంటే చర్య
హైదరాబాద్: మెరిట్ విద్యార్థులను పక్కనపెట్టి మైనార్టీ కాలేజీల యాజమాన్యాలు సీట్లు అమ్ముకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. బీఇడి కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా పాఠశాల విద్యాశాఖ మంత్రి మండవ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..మైనార్టీ కాలేజీల యజమాన్యాల తీరుపై ఓ కన్నేసి ఉంచామన్నారు.
మెనార్టీ బిఇడి కాలేజీలపై ఫిర్యాదుల అధికంగా రావడంపై ఆయన స్పందించారు. మైనార్టీ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను చేర్చుకోవడంలో స్వేచ్ఛ ఉన్నప్పటికీ, అది కూడా నిబంధనలు లోబడే జరగాలని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications