ఇక అన్ని సేవలు ఆన్ లైన్: సీఎం
హైదరాబాద్: త్వరలో ప్రభుత్వ సేవలన్ని ఆన్ లైన్ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలోని అన్నిశాఖల కార్యాలయాలను ఇంటర్ నెట్ ద్వారా అనుసంధానిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి, సేవల్లో జాప్యం నిరోధించాలంటే అన్ని రకాల సేవలను ఆన్ లైన్ సేవలుగా మార్చడమే ఉత్తమమార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.
గురువారం నెల్లూరు జిల్లా వెంకటాచలం గ్రామంలో తొలి సైబర్ గ్రామీణ్ ప్రారంభించాక హైదరాబాద్ లోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. హైదరాబాద్ లో ఈ-సేవ కేంద్రాల మాదరిగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఆన్ లైన్ సేవ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య సమన్వయం అంతా ఇక నుంచి ఇంటర్ నెట్ ద్వారా కొనసాగుతుందన్నారు.












Click it and Unblock the Notifications