సీఎంగా షిండే శనివారం ప్రమాణస్వీకారం
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి పూర్తిగా తెరపడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా సుశీల్ కుమార్ షిండే శనివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి పదవికి విలాస్ రావ్ దేశ్ ముఖ్ రాజీనామా చేయడంతో మహారాష్ట్ర గవర్నర్ మహమ్మద్ ఫజల్ షిండేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. డెమాక్రటిక్ ఫ్రంట్ నేతగా ఎన్నికైన షిండేకు మెజారిటీ నిరూపించుకునేందుకు గవర్నర్
రెండు వారాల గడువు విధించారు.
కాంగ్రెస్ భాగస్వామి అయిన ఎన్ సిపి నేత ఛగన్ భుజుబల్ మళ్ళీ ఉపముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. శనివారం సాయంత్రం కేవలం షిండే ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారు. కొద్ది రోజుల అనంతరం ఆయన తన మంత్రివర్గాన్ని ప్రకటిస్తారని తెలిసింది. ప్రస్తుతం వర్గాలు, కూటముల ప్రాతినిధ్యంపై కసరత్తు జరుగుతోంది.












Click it and Unblock the Notifications