బెయిల్‌పై ఆచార్య ధర్మేంద్ర విడుదల
దేవస్: విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) నాయకుడు ఆచార్య ధర్మేంద్ర శుక్రవారం బెయిల్‌పై విడుదలయ్యారు. ఐదు వేల రూపాయల పూచీకత్తుపై ఛీఫ్ జ్యుడిష్యల్ మెజిస్ట్రేట్ ఆర్.కె. భావే ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. రెచ్చగొట్టే ప్రసంగం చేశారనే ఆరోపణపై ఆచార్య ధర్మేంద్రను ఈ నెల 16వ తేదీన అరెస్టు చేశారు.
ఆచార్య ధర్మేంద్రపై పెట్టిన కేసులను సవాల్ చేస్తూ జబల్పూర్ సెషన్స్ కోర్టుకు గానీ, హైకోర్టుకు గానీ వెళ్లనున్నట్లు ఆయన తరఫు న్యాయవాది రాజేంద్ర బాపట్ చెప్పారు. అరెస్టు చేసిన అనంతరం ధర్మేంద్రను దేవస్‌కు తెచ్చారు. ఆ తర్వాత ఉజ్జెయినీకి తరలించి జైలులో పెట్టారు.
తాను బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోబోనని, తనను బేషరతుగా విడుదల చేయాలని తమ సంస్థ డిమాండ్ చేస్తోందని ఆయన అంతకు ముందు చెప్పారు. ఆచార్య బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, లేదంటే ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో అక్కడే వుండాల్సి వస్తుందని ఈ నెల 27వ తేదీన ముఖ్యమంత్రి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ అన్నారు.












Click it and Unblock the Notifications