కమ్యూనిస్టు నేత లావు కన్నుమూత
హైదరాబాద్: కమ్యూనిస్టు కురువృద్ధుడు లావు బాలగంగాధర రావు శుక్రవారం ఇక్కడ కన్నుమూశారు. సిపిఎం సీనియర్ నేత అయిన ఆయన గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో చికిత్స పొందుతున్నారు. ఆయనకు 80 ఏళ్లు.
ఆయన గుంటూరు జిల్లాలోని ఒక రైతు కుటుంబంలో జన్మించారు. 1939 నుంచి లావు బాలగంగాధరరావు కమ్యూనిస్టు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆయన సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా, పోలిట్ బ్యూరో సభ్యుడిగా పని చేశారు. ఆయన భౌతిక కాయానికి శనివారం సాయంత్రం విజయవాడలో అంత్యక్రియలు జరుగుతాయి. శనివారం ఉదయం 8 గంటల నుంచి కార్యకర్తల, అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని పార్టీ కార్యాలయంలో ఉంచుతారు.
లావు బాలగంగాధరరావు మృతికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు, సిపిఎం నేత కొరటాల సత్యనారాయణ సంతాపం ప్రకటించారు.












Click it and Unblock the Notifications