అద్వానీ, జోషీలకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీకి, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి మురళీ మనోహర్ జోషీకి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. కేంద్ర దర్యాప్తు బృందానికి (సిబిఐకి), ఇతరులకు కూడా నోటీసులు జారీ చేసింది. అయోధ్య కూల్చివేత కేసు విచారణను లక్నో నుంచి రాయబరేలీకి బదిలీ చేయడాన్ని అనుమతిస్తూ ఇంతకు ముందు తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలని కోరతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది.
సుప్రీంకోర్టు నిరుడు నవంబర్ 29వ తేదీన ఇచ్చిన ఆదేశాలను సమీక్షించాలని కోరుతూ మొహమ్మద్ అస్లాం అలియాస్ భూరే దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టీస్ జె.ఎస్. రాజేంద్ర బాబు, జస్టిస్ కె.జి. బాలకృష్ణన్, జస్టిస్ అరుణ్‌కుమార్‌లతో కూడిని బెంచ్ ఈ నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి అశోక్ సింఘాల్‌కు, ఉత్తప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు వినయ్ కతియార్‌కు, విహెచ్‌పి నాయకులు గిరిరాజ్ కిశోర్‌కు, విష్ణు హరి దాల్మియాకు, బిజెపి నేత ఉమాభారతికి కూడా నోటీసులు జారీ అయ్యాయి.












Click it and Unblock the Notifications