బిజెపిది విభజించే పాలన: సోనియా
న్యూఢిల్లీ: బిజెపి పరిపాలనలో దేశం విడిపోయిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఘాటుగా విమర్శించారు. మునుపెన్నడూ లేనంతగా దేశానికి ఇప్పుడు కాంగ్రెస్ పాలన అవసరం ఎంతో ఉందని ఆమె అన్నారు. మనమంతా ఇప్పుడు దేశం గురించి, దేశప్రజల గురించి ఆలోచించి, పార్టీ కోసమే తీవ్రంగా పనిచేయాలని సోనియాగాంధీ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో శుక్రవారం పార్టీ తొలి బ్లాక్ అధ్యక్షుల సమావేశాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె బిజెపిపై ఘాటైన విమర్శలు చేశారు.
బిజెపి పరిపాలనలో ప్రజల్లో అభద్రతా భావం పెరిగింది. ఆకలి చావులు పెరిగాయి. లంచగొండితనం పెచ్చుమీరిందని ఆమె అన్నారు. ఎన్నికల సమయంలో వీటినే తొలగిస్తామని మాట ఇచ్చిన బిజెపి వాటిని మరింత పెంచడం విచిత్రం అని ఆమె దొప్పిపొడిచారు. ప్రమాదకరమైన, వినాశకరమైన బిజెపి పాలనకు వ్యతిరేక వాతావరణం సృష్టించాల్సిన అవశ్యకత ఇప్పుడు ఏర్పడిందని ఆమె కార్యకర్తలకు సూచించారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఎం.సత్యనారయణరావు కూడా హాజరయ్యారు. సీఎల్పీ నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల కారణంగా సమావేశానికి హాజరుకాలేకపోయారు. కాంగ్రెస్ కా హాథ్, గరీబ్ కా సాథ్ అనే నినాదంతో జరుగుతోన్న ఈ సదస్సు మార్చి 30న ర్యాలీతో ముగుస్తుంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహం ఖారారు లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతోంది.












Click it and Unblock the Notifications