యుద్ధం వినాశకారి: వాజ్‌పేయి

చిత్రకూట్‌ (ఉత్తరప్రదేశ్‌): ఒకరిపై మరోకరు ఆధిపత్యం సంపాదించడానికి సాధనంగా ఉపయోగపడే యుద్ధం అంగీకారయోగ్యం కాదని ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అన్నారు. ఇరాక్‌ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ ఆయన శుక్రవారం కామాట్‌గిరి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆ మాటలన్నారు.

యుద్ధం వినాశకారి అని, యుద్ధం సమస్యను పరిష్కరించలేదని ఆయన అన్నారు. శ్రీరాముడు వనవాసానికి వచ్చినట్లు చెప్తున్న ప్రసిద్ద చిత్రకూట్‌ ప్రాంతానికి ఆయన రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చారు. రాముడు ప్రబోధించిన శాంతి, సహోదరత్వం, సహకార ఆదర్శాలను పెంపొందించాలని ఆయన దేశప్రజలకు పిలుపునిచ్చారు. గృహకలహం దశరథుడి సమస్యలకు, శ్రీరాముడి వనవాసానికి కారణమైందని, అది లంకలో యుద్ధానికి దారి తీసిందని ఆయన చెప్పారు.

అన్యాయాన్ని ప్రతిఘటిండాన్ని, ఆక్రమణను అర్థం చేసుకోవచ్చునని, కానీ ఆధిపత్యం కోసం ఆయుధాలు వాడడం తప్పని, ఆయుధాలు ప్రాణాలు తీయగలవు గానీ ప్రాణాలు పోయలేవని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+