వార్ మానవతా ఓటమి: సోనియా
న్యూఢిల్లీ: ఇరాక్‌పై అమెరికా సైనిక చర్య వల్ల ఉత్పన్నమవుతున్న పరిస్థితికి పరిష్కారం కనుక్కోకపోతే ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. పార్టీ బ్లాక్ అధ్యక్షుల సదస్సును ఆమె శుక్రవారం ఇక్కడ ప్రారంభించారు.
ఇరాక్ సంక్షోభానికి పరిష్కారం కనుక్కోకపోతే అది మానవత ఓటమి అని, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ప్రమాదం పొంచి వున్నట్లేనని ఆమె అన్నారు. అంతర్జాతీయ చట్టం నియమాలకు విరుద్ధంగా, ఐక్యరాజ్యసమితి ఆమోదం లేకుండా ఇరాక్‌పై జరుగుతున్న చర్యను అందరూ ఖండించాల్సిన అవసరం ఉన్నదని ఆమె అన్నారు. యుద్ధానికి వెంటనే స్వస్తి చెప్పి శాంతియుత పరిష్కారం కోసం ఐక్యరాజ్యసమితికి వివాదాన్ని తిరిగి నివేదించాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఇరాక్ బాధితులకు ఆమె సంఘీభావం ప్రకటించారు.












Click it and Unblock the Notifications