అయోధ్యపై కేంద్రానికి దెబ్బ
న్యూఢిల్లీ: అయోధ్య వివాదంలో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలింది. అయోధ్యంలో వివాద రహిత స్థలంలో మత కార్యకలాపాలను నిషేధిస్తూ ఇచ్చినస్టేను తొలగించాలని కోరుతూ కేంద్రం పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
అలహాబాద్ హైకోర్టు టైటిల్ దావాలను పరిష్కరించే వరకు సుప్రీంకోర్టు నిరుడు మార్చి 13/14 తేదీల్లో ఇచ్చిన ఉత్తర్వులు అమలులో ఉంటాయని జస్టిస్ ఎస్. రాజేంద్ర బాబు నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. మత సామరస్యాన్ని కాపడడానికే కాకుండా ఇతర బాధ్యతలన్నీ నెరవేర్చేందుకే ప్రభుత్వ దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు చెప్పింది.












Click it and Unblock the Notifications