ఇక మంత్రుల జిల్లాల పర్యటన
హైదరాబాద్: వచ్చే మూడు నెలల పాటు తమ తమ నియోజకవర్గాల్లో కరువు సహాయక పనుల్లో పాలు పంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను ఆదేశించారు. శాసనసభా సమావేశాలు ముగిసిన అనంతరం ఆయన సోమవారం సాయంత్రం తెలుగుదేశం శాసనసభా పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు.
బియ్యం పంపిణీ, సరాఫరా, కరువు రైతులకు పశుగ్రాసం, దాణా సరాఫరా వంటి పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ఆయన పార్టీ ఎమ్మెల్యేలనుకోరారు.
ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ సభ్యుల పనితీరు బాగుందని ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పలుమార్లు ఇరుకునుపెట్టేందుకు ప్రయత్నించినా, మంత్రులు సమర్ధంగా తిప్పికొట్టారని ఆయన తన సహచర మంత్రివర్గ సభ్యులను మెచ్చుకున్నారు. కాంగ్రెస్ తన మార్చుకోవడం లేదని, ఈ సారి ఎన్నికల్లో ఆ పార్టీకి ఎలాగూ ప్రజలు బుద్దిచెప్పుతారని, కరువు వంటి పనులను సరిగా చూడడం తెలుగుదేశం పార్టీ సభ్యులపై ఉందన్నారు.












Click it and Unblock the Notifications
