జపాన్ సంస్థ రావచ్చు: కోటగిరి
హైదరాబాద్: జపాన్ కార్ల నిర్మాణ సంస్థ రాష్ట్రానికి రాగలదని ఆశిస్తన్నట్లు భారీ పరిశ్రమల మంత్రి కోటగిరి విద్యాధర రావు చెప్పారు. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈవిషయం చెప్పారు.
గత ఐదేళ్లలో రాష్ట్రానికి వేయి కోట్ల రూపాయల పెట్టుబడితో 966 భారీ, మధ్యతరహా, లఘ పరిశ్రమలు వచ్చాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 2001 నుంచి జరిగిన మూడు భాగస్వామ్య సదస్సుల సందర్భంగా వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదిరినట్లు ఆయన తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు మౌలిక సదుపాయలు కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. మంత్రి సమాధనంతో సంతృప్తి చెందని కాంగ్రెస్, సిపిఎం నిరసన వ్యక్తం చేశాయి.












Click it and Unblock the Notifications