విశాఖలోని ఆయిల్ రిఫైనరీలో భారీ పేలుడు.. ఎగిసిపడుతున్న మంటలు
విశాఖపట్నం గాజువాకలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిటిటెడ్(హెచ్ పీసీఎల్) రిఫైనరీలో నవంబర్ 2 సోమవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి మంటలు చెలరేగి భారీ స్థాయిలో ఎగిసిపడుతున్నాయి. మంటల ధాటికి ఆ ప్రాంతం చుట్టూ దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రస్తుతం మంటలు ఆర్పుతున్నారు. ఇక భారీగా ఎగిసిపడుతున్న మంటలను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ఈ మేరకు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం, ఎవరైనా కార్మికులు గాయపడ్డారా..? అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక హెచ్ పీసీఎల్ రిఫైనరీలోని పిచ్ టవర్ ప్లాంట్ లో ఈ పేలుడు జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
Massive blasts being reported from HPCL Refinery, Visakhapatnam, Andhra Pradesh. Fire accident occurred inside the Sulphur unit. No casualties. Efforts are on to control the fire. https://t.co/Aehm0OaO4F
— Revathi (@revathitweets) November 2, 2026
మరోవైపు ఈ ఏడాది కాకినాడ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 21 మంది కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ఇదే ఏడాది జూన్ లో విశాఖలోని స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.












Click it and Unblock the Notifications
