AP Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడే..
ఇవాళ ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సాయంత్రానికి పూర్తి ఫలితాలను వెల్లడించేందుకు ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక తుపాను ప్రభావం ఉన్నప్పటికీ కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం లేకుండా ఎలక్షన్ కమిషన్ అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఆదివారం నవంబర్ 1 న జరిగిన పోలింగ్ లో దాదాపు 70 శాతానికిపైగా ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
మొత్తం 13 నగరపాలక సంస్థల్లో నమోదైన ఓట్ల నమోదును కౌంటింగ్ కోసం మొత్తం 22 కేంద్రాల్లో 308 కౌంటింగ్ హాల్స్ ను సిద్ధం చేసినట్లు ఎలక్షన్ కమిషన్ అధికారులు తెలిపారు. ఇందుకోసం 138 కేంద్రాలు, 556 హాళ్లు, 6,831 టేబుళ్లు ఏర్పాటు చేశారు.

ఇక కార్పొరేషన్లలో 4,026, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 2,805 టేబుళ్లు ఉన్నాయి. లెక్కింపు విధుల్లో 47,817 మంది సూపర్ వైజర్లు, అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొంటారని అధికారులు పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ హాళ్లలో 1,372 సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించనున్నట్లు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
