ఢాకా టోర్నీకి సచిన్, ద్రావిడ్ డుమ్మా
తిరువనంతపురం: ఏప్రిల్ లో బంగ్లాదేశ్ లో జరగనున్న త్రికోణ టోర్నమెంట్ లో సచిన్ టెండూల్కర్, వైస్ కెప్టెన్ ద్రావిడ్, ఫాస్ట్ బౌలర్ ఆషిష్ నెహ్రా పాల్గొనబోవడంలేదు. వీరుముగ్గురు గాయాల కారణంగానే ఈ టోర్నీలో ఆడకూడదని నిర్ణయించుకున్నారని సోమవారం బీసీసీఐపేర్కొంది. సచిన్, ద్రావిడ్ లు ఈ మేరకు బీసీసీఐకి లేఖ రాసినట్లుసెలెక్టర్ ఎస్.కె.సిన్హా తిరువనంతపురంలో విలేకరులకు తెలిపారు.
ఏప్రిల్ 11 నుంచి 20 వరకు జరిగే ఈ టోర్నీలో బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, భారత్ తలపడనున్నాయి. వరుసగా 18 నెలల అవిశ్రాంత పర్యటనల అనంతరం భారత్ జట్టులోని పలువురుసీనియర్ సభ్యులు విశ్రాంతివైపు మొగ్గుచూపుతున్నారు. దీంతోసెలక్షన్ సభ్యులు కొత్తవారిని సెలెక్ట్ చేయడంపై దృష్టిసారించవచ్చని తెలుస్తోంది. ఆశిష్ నెహ్రా తన కుడికాలి మడమకు శస్త్ర చికిత్స జరపుకోనున్నందున అంతర్జాతీయ క్రికెట్ కుఅయిదు నెలలు అందుబాటులో ఉండకపోవచ్చు.
ఇక ద్రావిడ్, సచిన్ లు కూడా తమ గాయాలకుశాశ్వత చికిత్స చేయించుకునే యోచనలో ఉన్నారు.వీరి ఇద్దరు అభ్యర్థనలను ఏప్రిల్ 2న ముంబైలో జరిగేసెలక్షన్ కమిటీ సమావేశంలో ముందు ఉంచుతాం. తుది నిర్ణయం కమిటీదేనని నాయర్ తెలిపారు.












Click it and Unblock the Notifications