సిద్దార్థ మెడికల్ కాలేజ్ లో ఆసుపత్రి
హైదరాబాద్: విజయవాడలోని సిద్దార్థ మెడికల్ కళాశాలలో ఆరు కోట్ల రూపాయాలతో 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నామని ప్రభుత్వం ప్రకటించింది. సోమవారంఅసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానంగా వైద్యశాఖ మంత్రి కోడెల శివప్రసాద్ రావు ఈ ప్రకటన చేశారు.
కోస్తా ప్రాంత ప్రజల వైద్య అవసరాలను తీర్చే నిమిత్తంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అలాగేవిజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్ కు తరలించే యోచనేదీ లేదని ఆయన స్పష్టం చేశారు. అలాంటి వార్తలు అబద్దమని తెలిపారు. కోస్తా ప్రాంతంలో భారీ ఆసుపత్రులు లేనందున, అక్కడ మెడికల్ కాలేజ్ లలోనే జనరల్ ఆసుపత్రుల నిర్మాణానికి యత్నిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications