వార్ అగ్రనేత కొమురయ్య ఎన్ కౌంటర్
కరీంనగర్: కరీంనగర్ జిల్లా మంథని అడవుల్లో శుక్రవారం రాత్రి పొద్దుపోయాక జరిగిన ఎన్ కౌంటర్ లోపీపుల్స్ వార్ అగ్రనేత అనుపురం కొమురయ్య అలియాస్ సుధాకర్ మరణించాడు. అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత పోలీసులు రెండు గంటల పాటు భారీ ఎత్తున ఎదురుకాల్పులు జరిపారు. అనంతరం శుక్రవారం తెల్లవారుఝామున పోలీసులు అడవుల్లో గాలించగా ఒక మృతదేహాం లభించింది.
పీపుల్స్ వార్ ఉత్తర తెలంగాణస్పెషల్ కమిటీ జోన్ ఇన్ ఛార్జి అయిన కొమురయ్య శవంగా గుర్తించారు. వార్ అగ్రనేత ఎన్ కౌంటర్ అయ్యాడన్న వార్త వార్ ను నిశ్చేష్టపరిచింది. ఈ నేపథ్యంలో వార్ ప్రతీకారచర్యకు పాల్పుడుతుందన్న ఉద్దేశంతో పోలీసులను ఉత్తర తెలంగాణాలో అలెర్ట్ చేశారు.












Click it and Unblock the Notifications