రూపాయి వరకు తగ్గిన పెట్రోధరలు
న్యూఢిల్లీ: పక్షం రోజుల్లో ప్రభుత్వ అధ్వర్యంలోనిపెట్రోలియం కంపెనీలు పెట్రోల్, డీజీల్ ధరలను రూపాయి మేరకు తగ్గించాయి. ఈ ధరల తగ్గింపు శనివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుంది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గడంతో ధరలు తగ్గిస్తున్నట్లు ఆ కంపెనీలు తెలిపాయి.
ఇరాక్ యుద్దం సమసిపోవడంతో అంతర్జాతీయంగాపెట్రోల్ ధరలు దిగివస్తున్నాయి. నిజానికి పెట్రోధరల పునఃసమీక్ష ఈ నెల ముఫ్ఫైన జరగాల్సి ఉన్నప్పటికీ, లారీ యజమాన సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు నాలుగు రోజుల ముందే రూపాయి మేరకు తగ్గించారు. న్యూఢిల్లీలో లీటర్‌పెట్రోల్ ధర రూ.31.49 పైసలు కాగా, ఢీజీల్ ధర 20.12పైసలు. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 35.49పైసలకు దిగివచ్చినట్లైంది.












Click it and Unblock the Notifications