ముగిసిన జర్నలిస్ట్ ల, టాలీవుడ్ వివాదం
హైదరాబాద్: ఎట్టకేలకు పవన్ కళ్యాణ్-చిరంజీవి కుటుంబం, డెక్కన్ క్రానికల్-జర్నలిస్ట్ సంఘాలవివాదానికి తెరపడింది. ఏప్రిల్ 18న చిరంజీవి కూతురు నిశ్చితార్థం సందర్భంగా మొదలైనవివాదం శనివారం నాడు ముగిసింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్, ఇతర సినిమా రంగప్రముఖులతో పాటు, జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధుల మధ్య శనివారం ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ప్రత్యేక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఇరువర్గాలు ఒక విడుదల చేసిన సంయుక్త ప్రకటనలోవివాదం పూర్తిగా ముగిసనట్లు తెలిపారు. జర్నలిస్ట్ లపై చేసిన వ్యాఖ్యలు, ఆవేశాకావేశాలు నిరోధించాల్సి ఉండింది. జర్నలిస్ట్ ల మనోభావాలను దెబ్బతీయడం మా ఉద్దేశం కాదు. అలా వారు భావించి ఉంటే క్షమాపణ కోరుతున్నామని మా అధ్యక్షుడు మురళీమోహన్ అన్నారు.
ఇరువైపులా తప్పు జరిగింది. అయితే, దాన్ని సామరస్యకు పరిష్కరించుకున్నాం. భవిష్యత్ లో ఇరువర్గాల తమ తమ బాధ్యతలను గుర్తుఎరిగి, జర్నలిస్ట్ లు కూడా తమ ఫరిధిలో ఉండాలని భావిస్తున్నాంఅని జర్నలిస్ట్ ల సంఘం ప్రకటించింది. ఈ సమావేశంలో అల్లుఅరవింద్, పరుచూరి గోపాలకృష్ణ, నిర్మాత డి.సురేష్ బాబు తదితర టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications