జమ్ములో ఏడుగురు జవాన్ల హత్య
జమ్ము: ఆర్మీ యూనిఫారంలో ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యుల దాడిలో జమ్ములో ఏడుగురు ఆర్మీ జవాన్లు మరణించారు. మరో 12 మంది గాయపడ్డారు. జమ్ముకు ఉత్తరాన 40 కిలోమీటర్ల దూరంలో గల తాండాసైనిక శిబిరంపై మిలిటెంట్లు మంగళవారం ఉదయం దాడి చేశారు.
వాహనంలో వచ్చిన మిలిటెంట్లు ఆర్మీ క్యాంపుసెంట్రీ జవాన్లపై కాల్పులు జరుపుతూ లోనికి ప్రవేశించారు. గ్రెనేడ్లు విసురుతూ,విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ మిలిటెంట్లు ఆర్మీ క్యాంపులోపలికి ప్రవేశించారని అధికార వర్గాలు వెల్లడించాయి. అప్రమత్తులైనసైనికులు మిలిటెంట్లపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరుమిలిటెంట్లు హతమయ్యారు.
వైష్ణోదేవి ఆలయం భక్తులపై బంగాంగ వద్దమిలిటెంట్లు దాడి ఏడుగురిని చంపిన 12 గంటల వ్యవధిలోనే ఈ ఆర్మీ క్యాంపుపై దాడి చేశారు. ఈ ఆర్మీ క్యాంపు వైష్ణోదేవి ఆలయానికి దగ్గరలోనే ఉంటుంది.












Click it and Unblock the Notifications