కాంగ్రెస్ దాదాగిరి సహించం: బీజేపీ
న్యూఢిల్లీ: ప్రతి పార్లమెంట్ సమావేశాల్లోనూ ప్రతిపక్షాలు అయోధ్యఅంశంపై దాదాగిరి చెలాయిస్తున్నారని బీజేపీవిరుచుకుపడింది. ప్రతిసారి ఈ అంశాన్ని ప్రస్తావనకు తీసుకువచ్చి సభను స్థంభించడంపై పాలక బీజేపీ ఘాటుగాస్పందించింది. పార్లమెంట్ లో 193వ నిబంధనకింద అయోధ్యపై చర్చకు సిద్దమని మంగళవారంప్రకటించింది.
ఈ నిబంధన కింద ఓటింగ్‌చేపట్టే అవకాశం ఉండదు. ఇప్పటికీ 20దఫాలకు పైగా దీనిపై చర్చించాం. అయినా చర్చిద్దామంటే 193వ నిబంధనకింద లోక్ సభలో చర్చకు మేం సిద్దమని బీజేపీఅధికార ప్రతినిధి వి.కె.మల్హోత్రా బీజేపీ పార్లమెంటరీ సమావేశం అనంతరంవిలేకరులకు చెప్పారు. అయితే, కాంగ్రెస్ దాదాగిరిని మాత్రంసహించబోమని స్పష్టం చేశారు. అయోధ్యవిషయంలో సీబీఐపై ఎలాంటి ఒత్తిడి లేదని పార్టీ అధ్యక్షుడుసమావేశంలో తెలిపారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications