ఆజంజాహీపై ఆత్మహత్య బెదిరింపు
వరంగల్: ఆజంజాహీ మిల్లుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర పార్టీ (టిఆర్‌పి) కార్యకర్త ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నానని బెదిరిస్తున్నాడు. నీళ్ల ట్యాంకుపైకి ఎక్కి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని అతను చెబుతున్నాడు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
కరీంనగర్ జిల్లాకు చెందిన గూడ కృష్ణా రెడ్డి అనే టిఆర్‌పి కార్యకర్త ఈ బెదిరింపులకు దిగాడు. ఈ సమయంలో టిఆర్‌పి వ్యవస్థాపకుడు గాదె ఇన్నయ్య అక్కడే ఉన్నారు. అతడ్ని కిందికి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆజంజాహీమిల్లు ఆస్తుల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునిఅందుకు ఏర్పాట్లు చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ గాదె ఇన్నయ్య దీక్షకు పూనుకున్నారు.












Click it and Unblock the Notifications